మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shiva Stuti (Vande Shambhum Umapathim) – శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం)
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్ |
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 1 ||
వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం
వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభమ్ |
వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 2 ||
వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం
వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినమ్ |
వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతిశాంతాకృతిం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 3 ||
వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే త్రయీఘోటకం
వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకమ్ |
వందే పద్మజసారథిం పురహరం వందే మహావైభవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 4 ||
వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం వందేందుగంగాధరమ్ |
వందే భస్మకృతత్రిపుండ్రనిటిలం వందేఽష్టమూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 5 ||
వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహమ్ |
వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 6 ||
వందే మంగళరాజతాద్రినిలయం వందే సురాధీశ్వరం
వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణమ్ |
వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 7 ||
వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థరాజ్యప్రదమ్ |
వందే సుందరసౌరభేయగమనం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 8 ||
వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽంధకారాపహం
వందే రావణనందిభృంగివినతం వందే సుపర్ణావృతమ్ |
వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 9 ||
వందే పావనమంబరాత్మవిభవం వందే మహేంద్రేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్ |
వందే జహ్నుసుతాంబికేశమనిశం వందే గణాధీశ్వరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || 10 ||
ఇతి శ్రీ శివ స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.